
*మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రిలో వసతులు, పరిసరాలు శుభ్రంగా ఉండాలి..5 కొత్త డయాలసిస్ మిషనరీ… MLA
మిర్యాలగూడ ప్రజాలహరి..
ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని *ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి* సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి హాస్పిటల్ లోని డయాలసిస్ హాల్ నీ సందర్శించారు పేసెంట్స్ విన్నపంతో హాల్ లో సరిపడా డయాలసిస్ మిషినరీ లేకపోవడంతో ప్రస్తుతం ఉన్న 5 మిషినరితో పాటు మరో కొత్త *5 డయాబెటిస్ మిథినరీ* శాంక్షన్ చేయించడం జరిగింది.. అలాగే హాల్ పైన ఉండడంతో పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు అని త్వరలోనే గ్రౌండ్ ఫ్లోర్ హాల్ లోకి షిఫ్ట్ చేయాలని కొత్త మిషనరీ తో కలిపి 10 మిషిన్స్ కింద హాల్ లో ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు .. అనంతరం హాస్పిటల్ లోని జనరల్ వార్డ్, గర్భిణీ స్త్రీల వార్డ్ లను సందర్శించి అక్కడి సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం హాస్పిటల్ ఆవరణలో పరిశీలించి వాహనాల పార్కింగ్ మరియు పేసెంట్స్ తో వచ్చిన విసిటర్స్ విశ్రాంతి తీసుకునే విధంగా చెట్లని మరియు సిమెంట్ బల్లాలను ఏర్పాటు చేయాలని అలాగే పరిసరాలలో ఎటువంటి చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని .. కార్పొరేట్ హాస్పిటల్స్ లో కంటే మన ఏరియా ఆసుపత్రికి వచ్చేలా వసతులు పరిసరాలు ఉండాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.