*గ్రామీణ వైద్య అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి.,.గత కొద్ది రోజులుగా దామరచర్ల మండలంలో విష జ్వరాలు అధికమై ప్రజలు అనారోగ్యంతో బాధపడుతుండడంతో విషయం తెలుసుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి DMHO గారిని సంప్రదించి ఈరోజు దామరచర్ల మండల పరిధిలో గ్రామీణ వైద్యులు, మరియు అధికారులతో *ఉచిత వైద్య శిబిరం* ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం ప్రారంభించిన MLA *బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. వైద్యులు , అధికారులు సమయపాలన పాటించడం లేదు ఉదయం 6 గంటల వరకు ప్రారంభం అవ్వాల్సిన కార్యక్రమాన్ని 8 గంటలకు ప్రారంభం చేశారు.. *గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ పనుల రీత్యా ఉదయం 9 తర్వాత అందుబాటులో ఉండరు కావున అందరూ ఉదయం 6 గంటల వరకు వైద్య సేవలు ప్రారంభించాలి తెలియజేసాము* … నిత్యం ఎలాగో ప్రజలకు అందుబాటులో ఉండరు కనీసం ఇలాంటి క్లిష్ట సమయంలో ఐనా బాధ్యతగా ఉంటూ సమయపాలన పాటించండి అని వారి పై మండిపడ్డారు .. అలాగే ఈ విష రోగాలకు కారణమవుతున్న దోమల నివారణ ఎలా చేయాలి.. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అవగాహన వైద్యులు మరియు గ్రామ సెక్రటరీలు కలిసి ప్రజలకు కల్పించాలి .. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజలకు సేవలు అంధించగలము అని అన్నారు… అలాగే ప్రజలు అందరూ ఈ ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని .. అలాగే విష జ్వరాల నియంత్రణలో మీరు కూడా బాధ్యతగా ఉండాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.