
*ఏరియా ఆసుపత్రి నుంచి ప్రారంభం అయిన మిర్యాలగూడ పట్టణ పారిశుధ్య స్వచ్ఛంద కార్యక్రమం… లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి….
నా మీద నమ్మకం ఉంచి గెలిపించిన ప్రజలకు సేవ చేయాలనేదే నా లక్ష్యం అందుకోసం అహర్నిశలు శ్రమిస్తా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి *నేను నా మిర్యాలగూడ* కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న *పట్టణ పారిశుధ్య స్వచ్ఛంద కార్యక్రమం* పలు స్వచ్చంధ సంస్థల ఆధ్వర్యంలో ఏరియా ఆసుపత్రి నుంచి ప్రారంభించడం జరిగింది… ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేను నా మిర్యాలగూడ అని ప్రతిఒక్క మిర్యాలగూడ వాసి గర్వంగా చెప్పుకునే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గాన్ని తీర్చి దిద్దాలి అనే లక్ష్యంతో మొదట పట్టణ పారిశుధ్య కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది.. ఈ కార్యక్రమం ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం వర్షాకాలంలో డ్రైనేజ్ ల మూలాన దోమలు అధికమై ప్రజలు విష రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయి వాటిని నియంత్రించాలి అనే ఉద్దేశంతో మొదట ఈ పట్టణ పారిశుధ్య స్వచ్ఛంద కార్యక్రమం ఎంచుకోవడం జరిగింది… ఇదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నేను నా మిర్యాలగూడ కార్యక్రమంలో భాగంగా పలు స్వచ్చంధ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలు మన మిర్యాలగూడ వైపు చూసే విధంగా చేయాలి అనేది మా యొక్క ప్రథమ లక్ష్యం దానికి అధికారుల, ప్రజల సహకారం కూడా చాలా అవసరం మనం అందరం కలసి కట్టుగా, బాధ్యతగా పనిచేస్తూ ఉంటే మన నియోజకవర్గం పారిశుద్ధ్యంలో, విద్యలో, వైద్యంలో, సామాజిక న్యాయంలో ముందు ఉండే అవకాశం ఉంటుంది అని అన్నారు…. ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు స్వచ్ఛందంగా వచ్చిన *లయన్స్ క్లబ్ వారికి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి, హెల్త్ డిపార్ట్మెంట్ వారికి, పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి, పారిశుధ్య కార్మికులకు , రెవెన్యూ డిపార్ట్ మెంట్ వారికి, జనయేత్రీ ఫౌండేషన్ వారికి, ఫోటో గ్రాఫర్స్ యునియన్ వారికి , కాంగ్రెస్ నాయకులకు మరియు BLR బ్రదర్స్* కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు…. అనంతరం ఈరోజు కార్యక్రమంలో భాగంగా *12 వార్డులలో* ఈ కార్యక్రమం సాయంత్రం వరకు కొనసాగుతుంది అని అన్నారు.. ప్రతిఒక్కరూ వారి వారి వార్డులలో పాల్గొనాలని పిలుపునిచ్చారు… -మాటలు చెప్పడమే కాకుండా..తాను ఆచరిస్తానంటూ పారిశుద్ద్య కార్మికుడి అవతారమెత్తిన ఎమ్మెల్యే, పలు వార్డ్ లలో పారిశుధ్య కార్మికులతో డ్రైనేజ్ లు శుభ్రం చేశారు..
ప్రజలిచ్చిన ఐదేళ్ల అవకాశాన్ని రాజకీయ నాయకుడిగా కాకుండా..ప్రజా సేవకుడిగా మిర్యాలగూడ అభివృద్ధి కోసం పని చేస్తా అని అన్నారు..