
ప్రజాలహరి హైదరాబాద్
.తెలంగాణలో చేపట్టిన జాతీయ రహదారుల నిర్మాణంలో భూ సేకరణతో పాటు ఇతరత్రా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించడానికి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. నేషనల్ హైవేస్ ఉన్నతాధికారులు సీఎంతో సమావేశంకాగా, జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురయ్యే ఆటంకాలను తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్డును భారత్‌మాల పరియోజన పథకం కింద చేర్చాలని కోరారు. వైబ్రెంట్ తెలంగాణ లక్ష్య సాధనలో ఈ రింగ్ రోడ్డు ప్రాధాన్యతను సీఎంగారు వివరించారు. రాష్ట్రంలో ప్రతిపాదిత జాతీయ రహదారుల నిర్మాణంపై ప్రతి వారం నివేదికలు ఇవ్వాలని సీఎంగారు అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణంలో #NHAI లేవనెత్తిన పలు అంశాలపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం వివరించారు. ముఖ్యమంత్రి వెంట తెలంగాణ రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి వెంకటరెడ్డి పాల్గొన్నారుర