రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతుంది అందుగు పార్టీ , ప్రభుత్వ యంత్రాంగం సిద్ధం కావాలి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి…. నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించిన *జిల్లా ప్రజా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో* పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.జిల్లా ప్రజా పరిషత్ వివిధ శాఖల అధికారులతో మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రాబోయే ఆగష్టు 15న రైతు ఋణ మాఫీ చేయబోతోంది కావున అధికారులు ప్రతిఒక్క రైతుకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి .. ఎందుకు అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం అనే విధంగా పనిచేయాలి … గత పంటలు నీటి కొరత వలన రైతులు తీవ్ర నష్టపోయారు .. రానున్న రోజుల్లో వర్షాలు కూడా బాగా పడి నీటి కొరత కూడా తీరబోతుంది .. కానీ వర్షాకాలంలో ముఖ్యంగా రైతులకు కరెంటు కోత లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనం తీసుకోవాలి ..వ్యవసాయానికి మన ప్రభుత్వం పెద్ద పీట వేయాలి అంటే అధికారులు కూడా అంతే కృషి చేయాలని కోరారు.