Ultimate magazine theme for WordPress.

త్వరలో తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Post top
home side top

ప్రజాలహరి హైదరాబాద్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది.

 

2024 డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని, నైతికతను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా సీఎం అన్నారు.

 

ఆధునిక భారత రూపకర్త, ఐటీ విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దార్శనికుడికి ఘన నివాళి అర్పించారు.

 

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ గారి విగ్రహం వద్ద సీఎం పుష్పాంజలి ఘటించారు.

 

రాజీవ్ గాంధీ గారి ముందుచూపు వల్లే భారతదేశం ఇప్పుడు ఆర్థిక, సాంకేతిక రంగాల్లో పటిష్టంగా మారిందని, స్థానిక సంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్, యువతకు 18ఏండ్లకే ఓటు హక్కు కల్పించడం వంటి నిర్ణయాలు కూడా రాజీవ్ గారి హయాంలో తీసుకున్నవే అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.

 

యువతకు ఆదర్శపాయుడైన రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుడని, అలాంటి స్ఫూర్తిమంతమైన నాయకుడి విగ్రహాన్ని సచివాలయం ముందు ప్రతిష్టించుకోవడం ఎంతైనా సముచితమని, త్వరలోనే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

 

రాజీవ్ గాంధీ గారి ఆశయాల మేరకు యువతను అన్ని రంగాల్లో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం తలపెట్టిందని, అందులో భాగంగానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.

 

మారుమూల తండాలు, గూడేల్లో, అలాగే పట్టణాల్లో మరుగునపడి ఉన్న మెరికల్లాంటి క్రీడాకారులను వెలికితీస్తామని, త్వరలో ప్రారంభంకానున్న యంగ్ ఇండియా తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీలో వారికి శిక్షణ ఇప్పించి, అంతర్జాతీయ వేదికలపై దేశానికి మెడల్స్ తెచ్చేవారుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.

 

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మాజీ ఎంపీ వి.హనుమంతరావు గారి కోరిక మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా పలువురు క్రీడాకారులకు ఆర్థిక సహాయం అందజేశారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.