*ఘనంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
— నేటి యువతరం నేతాజీ బాటలో నడవాలి
— పరంగిరాము
— నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి.
*మిర్యాలగూడ ప్రజాలహరి..
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 85వ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి. పరంగిరాము పాల్గొని మాట్లాడుతూ భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమంలో మరియు భారతదేశ మౌలిక ఆర్థిక అభివృద్ధి అంశాలను ప్రతిపాదికన తీసుకొని ఒక మహత్తర కార్యరూపం దాల్చే సందర్భంలో సొంతంగా మిలిటరీ వ్యవస్థ నిర్వహించి దానికి ఆజాద్ హింద్ అని నామకరణం చేసి పెద్ద ఎత్తున ప్రతి ఒక్క కుటుంబం నుండి మీరు రక్తాన్ని నాకు ఇవ్వండి నేను మీకు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అందిస్తానని చెప్పినటువంటి మహానుభావుడు నేతాజీ వారి యొక్క ఉద్యమ పోరాటం ఉదృత్తిని చూసి నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ప్రతిపాదించిన అనంతరం ఆయన భారతదేశ ప్రజల యొక్క సౌలభ్యం కోసం ఉద్యమాలు చేస్తున్న అనివార్య కారణాలవల్ల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపించడం జరిగింది . నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ AIFB పార్టీని స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన ఆశయ సాధన కోసమే ముందుకు పోరాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఆదర్శంగా తీసుకొని నేటి యువతరం ముందుకి కొనసాగాలని అవినీతి రహిత సమాజం కోసం చెడు వ్యసనాలకు యువత దూరంగా ఉండాలని ఆయన యువతకురానికి పిలుపునివ్వడం జరిగింది.
*ఈయొక్క కార్యక్రమంలో …* ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్. ఎండి.జలీల్, ఎస్.శ్రీనివాస్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు. చెన్నబోయిన నర్సమ్మ, మండల కన్వీనర్. టింగీకారి పద్మ, మంజుల, త్రివేణి, సైదమ్మ, నాగమణి, మరియు పార్టీ జిల్లా నాయకులు. శ్రీనివాసరావు, ఉదయ్ కుమార్, ఆదినారాయణ, యువజన విభాగం నాయకులు. కూరపాటి మహేష్, ప్రసాద్, కిషన్ లాల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు. ఎండి.నసీర్, సమీర్, అక్రం, తదితరులు పాల్గొన్నారు.
