Ultimate magazine theme for WordPress.

ఫేక్ నెంబర్ ప్లేట్లతో మోసాలకు పాల్పడుతున్న ముఠాలు వ్యూహం పన్నుతున్న పోలీసులు

Post top

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్

మిర్యాలగూడలో ఫేక్ నెంబర్ ప్లేట్లతో పోలీసులు పరేషాన్ లభ్యంగానీ ఆచూకీ పోలీసులకు కంట నిద్ర లేకుండా చేస్తున్న వైనం. షాభూ నగర్ ,బైపాస్ రోడ్డు ఈదలగూడ, హౌసింగ్ బోర్డ్, రవీందర్ నగర్ ,హైవే పై ప్రాంతాల్లో కొందరు కార్లకు ద్విచక్ర వాహనాలకు డూప్లికేట్ నెంబర్ ప్లేట్లు తగిలించుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒక ఆక్సిడెంట్ కేసు మరియు ఒక పెద్ద మనిషికి జరిగిన ఘటనే ఉదాహరణ. వారు చెప్పిన వివరాలు ప్రకారం పోలీసులు ఆన్లైన్లో ట్రేస్ అవుట్ చేయగా ఆ నెంబర్ ప్లేట్ వాళ్లకు నాట్ ఫౌండ్ అని వస్తుంది దీంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు మిర్యాలగూడ డివిజన్ పోలీసులు ఎప్పటికప్పుడు నెంబర్ ప్లేట్లు లేని వాహనాలు తనిఖీ చేస్తున్నప్పటికీ ఈ ఫేక్ నెంబర్ విధానాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు దీనికి ఏం చేయాలని పోలీసులు దీర్ఘంగా ఆలోచనలో పడ్డారు.మిర్యాలగూడలో ద్విచక్ర వాహనాలు గాని వాహనాలు గాని ఫేక్ నెంబర్లతో అనేక వాహనాలు సంచరిస్తున్నట్లు మరియు అంతరాష్ట్ర నుండి దిగుమతి అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం బండి కున్న చాసిస్ నెంబర్ కు గాని ఆర్ సి నెంబర్కు గాని నెంబర్ ప్లేట్ గాని ఎటువంటి సంబంధం లేకుండా వాహనాలు తిరుగుతున్న సందర్భంలో ప్రజా రవాణా నిమిత్తం గాని వివిధ అక్రమ పనులకు వినియోగిస్తున్నట్లు మరియు మైనారిటీ తీరని 15 సంవత్సరాలు అంతకు లోపు పిల్లలు వాహనాలు నడిపించుచూ పాదచారులను అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ క్రమంలో వాహనాలను నిజమైన వాహనాలను పట్టుకోవడం కష్టతరంగా మారింది. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు కాలం చెల్లిన వాహనాలకు కూడా ఫేక్ నెంబర్ల ద్వారా గుర్తించలేని మరో నెంబర్ను కొందరు ఆకతాయిలు బిగించుచున్నారు .కాగా వాహనాలపై నిఘాను తనిఖీలను పెంచవలసిందిగా పలువురు ప్రజలు కోరుచున్నారు..

 

వాహనం వెంట ఆర్సి బుక్, డ్రైవింగ్ లైసెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ ,ఇన్సూరెన్స్ కాగితాలు కచ్చితంగా ఉండాలి… ప్రజలకు, వాహన చోదకులకు పోలీసులు విజ్ఞప్తి.. ప్రస్తుత ఈ ఫేక్ నెంబర్ల గందరగోళాన్ని చేదించాలంటే ప్రతి వాహనదారుడు తమ వాహనం తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లను క్రమం తప్పకుండా ఉంచుకోవాలని పోలీసులు ఎప్పుడు తనిఖీ చేస్తే అప్పుడు చూపించే విధంగా ఉండాలని మిర్యాలగూడ డివిజన్ పోలీసులు ప్రజల్ని, ద్విచక్ర చతుర్ధ శకటవాహనదారులను కోరుతున్నారు .ఈ విధానం వల్ల కొంతమేరకు ఫేక్ నెంబర్లను కంట్రోల్ చేసి ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా చూడవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. మిర్యాలగూడలో పోలీసుల సంఖ్య తక్కువ ఉన్న నేపథ్యంలో దొంగతనాలు ఇతర వాటిని కంట్రోల్ చేయాలంటే ప్రజలు కంపల్సరిగా సహకరించాలి పోలీసులు ఎప్పటికప్పుడు వాహనదారులను తనిఖీ చేస్తున్న కొందరు పోలీసుల కన్నుగప్పించి అక్రమమైన మార్గాల్లో వెళ్లిపోతున్నారు.. ఇన్సూరెన్స్, పొల్యూషన్ కట్టుకోవాల నే విషయాన్ని వాహనదారుడు మర్చిపోతున్నాడని వాహనదారుడు చెందిన తల్లిదండ్రులు గాని, బంధువులు కానీ, స్నేహితులు గాని ఈ విషయాన్ని అర్థమయ్యే రీతిలో చెప్పాలని ఈ సందర్భంగా పోలీసులు కోరుతున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.