
గన్ పార్క్ వద్ద అమరవీరులకు అశ్రు శ్రద్ధాంజలి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ప్రజాలహరి జనరల్ డెస్క్ హైదరాబాద్ …తెలంగాణ అభివృద్ధికి పిడికిలి బిగించి ముందుకు సాగాలి అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం అమరవీరుల స్తూపం వద్ద పుష్పవృత్యాలు నుంచి నివాళులర్పించారు ఆయనతోపాటు తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శాసనసభ స్పీకర్, శాసనమండలి స్పీకర్, తెలంగాణ డిజిపి రవి గుప్తా, తెలంగాణ సీఈవో శాంతకుమారిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.