తెలంగాణ ఆవిర్భావన రోజున ప్రభుత్వ హై స్కూల్స్లో స్వీపర్లకు తన వేతనాన్ని ప్రకటించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

వినూతన ప్రకటనలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి…..
మిర్యాలగూడ ప్రజాలహరి..
*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు * బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో MLA క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది..అనంతరం అమరవీరుల స్థూపం నందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల స్థూపం సాక్షిగా మన మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ *ప్రభుత్వ హై స్కూల్స్ లోని స్వీపర్స్ కి ప్రతీ నేలా నాకు ప్రభుత్వం నుంచి వచ్చే వారి జీతం నుంచి వారికి కొంత రుసుము అందజేస్తానని అన్నారు.. అలాగే అతి త్వరలోనే మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, తండాలు పర్యటించి , గ్రామస్థులు, అధికారులతో పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎంటి అనే విషయంలో సమాచారం సేకరించి , గ్రామస్థులతో మాట్లాడి వారి ప్రస్తుత సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది .. అదే విధంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రతీ వార్డు కూడా సాయంత్రం పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అని అన్నారు*. ఈ కార్యక్రమ పూర్తి ప్రణాళిక అతి త్వరలోనే ప్రకటిస్తాం అని అన్నారు.. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ కారులను, అమరులైన అమరవీరులను చరిత్ర ఎప్పటికీ మరిచిపోకూడదు .. వారి అందరి త్యాగ ఫలితమే మన ఈ తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి కష్టమో పోరాటమే కాదు, కవులు, కళాకారులు, విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉద్యమ సంఘాలు ఇలా సకలజనుల కలిసి పోరాడి సాధించుకున్నది.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన *శ్రీమతి సోనియా గాంధీ కి* కూడా ప్రతిఒక్కరం కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.