Ultimate magazine theme for WordPress.

ట్రాఫిక్ రూల్స్ బేఖాతర్ …మాఇష్టం మాదే రాజ్యం

left home Post top

ప్రజాలహరి క్రైమ్, మిర్యాలగూడ… అస్తవ్యస్తమైన ట్రాఫిక్ వ్యవస్థ పట్టించుకోని మిర్యాలగూడ ట్రాఫిక్  పోలీసులు. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలోనే ఈ రకంగా ఉంటే ఇక ఆఫీసులో స్కూళ్లు విడిచి పెట్టే సమయానికి అంటే సాయంత్రం ఐదున్నర ఆ సమయానికి రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ట్రాఫిక్ రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ట్రాఫిక్ ఈ రకంగా ఉండటం వల్ల వాహన చోదకులు ఇబ్బందులకు గురవుతున్నారు.ప్రమాదాలు కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తోపుడు బండ్లు చెనక్కాయల బండ్లు ,అరటిపండ్ల పనులు అయితేనేమి నాలుగు చక్రాల వాహనాలు అయితే నేమి రోడ్డు బౌండరీ దాటి బయటిదాకా పెట్టడం వల్ల ఈ ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతుందని పలువురు పట్టణ వాసులు వాపోతున్నారు. కానీ ఇదేమి మిర్యాలగూడ పట్టణ ట్రాఫిక్ పోలీసులకు పట్టడం లేదని వాహన చోదకులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.