మిర్యాలగూడ ప్రజాలహరి..
దేవరకొండ మాజీ శాసనసభ్యులు *దివంగత నేత రాగ్యనాయక్ 22వ వర్ధంతి* సందర్భంగా మిర్యాలగూడ రాజీవ్ భవన్ మరియు బస్ స్టాండ్ ఆవరణలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న *MLA బత్తుల లక్ష్మరెడ్డి * అనంతరం వారి విగ్రహానికి పుల మాలవేసి నివాలులర్పించినారు.ఈ సందర్భంగా బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి వారే *స్వయంగా రక్తదానం* చేసి వారిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బలహీనవర్గాల నేతగా రాష్ట్రంలో పేరొందిన నేత అని కాంగ్రేస్ పార్టీకి వారు సేవలు ఆమోగం అన్నారు.ప్రతి నిత్యం పేదల కోసం కొట్లాడుతూ ఉండే *రాగ్య నాయక్ గారు* చివరికి అడవి అన్నల తూటలకు బలికావడం చాలా బాధాకరం అన్నారు.రానున్న రోజుల్లో వారి ఆశయ సాధనలో భాగంగా కాంగ్రేస్ సైనికులుగా మన వంతు కృషి చేయాలని కాంగ్రేస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో Ex;MLC చిప్ విప్ భారతి రాగ్య నాయక్ ,DCC శంకర్ నాయక్ ,స్కైలాబ్ నాయక్ ,దామరచర్ల MPP నందిని రవితేజ,చిర్రుమరి కృష్ణయ్య,రామలింగయ్య,గాయం ఉపేందర్ రెడ్డి,నాగు నాయక్,అర్జున్,వేణుగోపాల్ రెడ్డి కాంగ్రేస్ కార్యకర్తలు పాల్గొన్నారు.