దామరచర్ల ప్రజాలహరి…
అడవిడేవులపల్లి మండలం ప్రజా పరిషత్ కార్యాయంలో నిర్వహించిన *మండల సర్వ సభ్య సమావేశం* లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి.. అధికారులతో మాట్లాడి మండల పరిధిలోని వివిధ శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న పనులపై, పూర్తి చేసిన పనులపై రివ్యూ నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలం పట్టణానికి దూరంగా, ఉన్నందు వలన ఇక్కడి ప్రజలకు విద్య, వైద్యం విషయంలో ఎటువంటి ఇబ్బందీ రాకుండా చూడాలని అన్నారు.. అలాగే ఇక్కడ మంచి నీటి కొరత ఎక్కువగా ఉందని గ్రామస్థులు చెప్తున్నారు, కావున రాబోయే వేసవి కాలంలో మంచి నీటికి సమస్య రాకుండా చూడాలని అన్నారు.. ఈ మండలంలోని అనేక గ్రామాల్లో కరెంట్ కోత కూడా అధికంగా ఉంది .. దానికి కూడా తొందరలో చెక్ పెట్టాలని అన్నారు.. గత ప్రభుత్వం లో అధికారులు ఎలా పనిచేశారో తెలియదు కానీ మా ప్రభుత్వంలో మాత్రం పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల కోసం అధికారులు కూడా పనిచేయాలని అన్నారు… అదే విధంగా గ్రామస్థులు విన్నపం మేరకు వీలైన త్వరలోనే సంబంధిత మంత్రి గారితో మాట్లాడి *దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్* కూడా పూర్తి చేయిస్తానని అన్నారు .. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
