Ultimate magazine theme for WordPress.

కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది.. టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

left home Post top

*అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం….. మాజీ MLA నల్లమోతు భాస్కరరావు

 

 

*ఆనాడు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు ఇచ్చింది..!*

(వేములపల్లి ప్రజాలహరి)

*ఈ రోజు మీరు కాంగ్రెస్ బాకీ కార్డు ఇవ్వండి..!*

 

*బాకీ చెల్లించి ఓటు అడుగు… !*

 

*మీరు చేసిన అప్పులు మీ అర్బటాలల్లో కనిపిస్తున్నాయి…*

 

*ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..*

 

*ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…*

 

ఈ రోజు మాడుగుల పల్లి మండల కేంద్రంలో, గల VVN గార్డెన్స్ లో స్థానిక సంస్థల సన్నాహ సమావేశంలో, *మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమోతు భాస్కరరావు గారు, మరియు నల్గొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నాగార్జునసాగర్ మాజీ శాసనసభ్యులు నోముల భగత్ గారు* హాజరయ్యారు , ఈ సందర్భంగా కార్య కర్తలతో మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,

 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

 

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

 

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

 

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

 

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

 

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

 

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

 

 

ఇట్టి కార్యక్రమంలో, పలుట్ల బాబయ్యా, మోసిన్ అలీ, నవీన్ రెడ్డి, రాములు గౌడ్, పోకల రాజు ,శ్రీనివాస్ రెడ్డి ,పగిళ్ల సైదులు, నరేందర్ రెడ్డి ,కాసిం, మారుతి వెంకటరెడ్డి, యాదగిరిరెడ్డి ,ఇంద్రారెడ్డి ,సతీష్ ,శ్రావణ్ రెడ్డి, కోటిరెడ్డి, వెంకటాచారి ,అఫ్జల్, సైదులు, ,కర్ర శ్రీను ,గడ్డ శ్యామ్ ,శర్మ, కృష్ణయ్య, జంగయ్య ,గోవర్ధన్ ,ఫంక్షనల్ చారి, మరియు మాజీ ఎంపీటీసీలు మాజీ జడ్పీటీసీలు మాజీ సర్పంచులు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.