*స్వయం ఉపాధి కల్పన పై దివ్యాంగులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్*
*దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పన కొరకు మంజూరైన యూనిట్ గ్రాంట్ పత్రాలను అందజేసిన ఎంపీడీవో*
మిర్యాలగూడ ఆగస్టు 23. ప్రజాలహరి
మిర్యాలగూడ మండల సమైక్య కార్యాలయంలో మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పన పై అవగాహన సదస్సు మరియు శిక్షణ కార్యక్రమం డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీడీవో శేషగిరి శర్మ హాజరై దివ్యంగా అభ్యర్థులకు బెన్ఫిషరీ గ్రాంట్ పత్రాలను అందించారు అనంతరం శిక్షణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు స్వయం ఉపాధి కల్పన కోసం నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమం దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతుందన్నారు అదేవిధంగా దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా స్వయంగా తమ వ్యాపారాన్ని తామే చేసుకునే విధంగా దోహదపడుతుందన్నారు రెడ్డిస్ ల్యాబ్ ఫౌండేషన్ వారు దివ్యాంగుల స్వయం ఉపాధి కల్పన కొరకు మండలాన్ని యూనిట్గా తీసుకొని వివిధ గ్రామాల నుండి అర్హులైన 16 మంది దివ్యాంగ అభ్యర్థులను ఎంపిక చేసి వారు వ్యాపారాలు చేసుకుంటూ అభివృద్ధి చెందడానికి ఒక్కొక్క అభ్యర్థికి 25వేల రూపాయల విలువచేసే కుట్టు మిషన్లు పిండి మిల్లులు మరికొన్ని యూనిట్లను డాక్టర్ రెడ్డి ఫౌండేషన్ వారు అందించడం చాలా అభినందించదగ్గ విషయం అన్నారు సమాజంలో అన్ని బాగుండి కూడా ఏమీ చేయకుండా ఇతరులపై ఆధారపడి బ్రతికేవారు ఉన్న ఈ రోజుల్లో దివ్యాంగులు తమ సొంత వ్యాపారంపై అభివృద్ధి చెందాలనే ఆలోచనతో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఈ శిక్షణ కార్యక్రమానికి వచ్చిన దివ్యాంగ మిత్రులను అభినందిస్తున్నా మన్నారు అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న దివ్యాంగ అభ్యర్థులకు బెనిఫిషరీ యూనిట్ గ్రాండ్ పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డైరెక్టర్ పిఎన్ శ్రీనివాస్ దివ్యాంగులకు శిక్షణ తరగతులు నిర్వహించిన అనంతరం వ్యాపార అభివృద్ధికి కావలసిన మెలుకువల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శేషగిరి శర్మ డిపిఎం రామలింగయ్య సిడిపిఓ మామత ఏపిఎం దిలీప్ కుమార్ డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ డైరెక్టర్ పిఎన్ శ్రీనివాస్ టెరిటరీ హెడ్ సాయితేజ క్లస్టర్ కోఆర్డినేటర్స్ ఓం ప్రకాష్ మహేష్ మణికంఠ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
