ప్రజాలహరి హైదరాబాద్ > హైదరాబాద్: సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. సహస్రను హత్య చేసిన బాలుడు సైకో అవతారం.. యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి బాలిక హత్య.. పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రను చంపిన బాలుడు.. హత్య చేసిన తర్వాత ఆధారాలు మాయం చేయడం నేర్చుకున్న బాలుడు.. పోలీసుల విచారణలో క్రిమినల్ ఇంటెలిజెన్స్ గా వ్యవహరించిన బాలుడు..
[ హైదరాబాద్: 18వ తేదీన బాలిక సహస్ర హత్య జరిగింది.. 3 రోజుల పాటు సరైన క్లూ దొరకలేదు.. పక్కింట్లో ఉన్న 14 ఏళ్ల బాలుడే సహస్రను హత్య చేశాడు.. క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు సహస్ర ఇంట్లోకి వెళ్లిన బాలుడు, బ్యాట్ తీసుకుని వస్తుండగా చూసి అరిచిన సహస్ర.. సహస్రను బెడ్‌రూంలోకి తోసి కత్తితో దాడి చేసిన బాలుడు: సీపీ అవినాష్ మహంతి
.. బాలుడిని ప్రశ్నించగా విచారణలో తప్పుదారి పట్టించే సమాధానాలు చెప్పాడు.. హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నాం.. బాలుడే హత్య చేసినట్లు అన్ని ఆధారాలు లభించాయి.. దొంగతనానికి సంబంధించిన మొత్తం ప్లాన్‌ను ఓ నోట్‌లో రాసుకున్నాడు.. దొంగతనం కోసం నెల రోజుల ముందే ప్లాన్ వేసిన బాలుడు.. క్రికెట్ బ్యాట్ విషయంలో సహస్ర తమ్ముడితో ఒకసారి గొడవ పడిన బాలుడు: సీపీ అవినాష్ మహంతి
హైదరాబాద్: నా కూతురికి జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగకూడదు.. తన బిడ్డను విగత జీవిగా చూసి తట్టుకోలేకపోయాను.. నా కూతుర్ని పొట్టన పెట్టిన వాడికి తప్పకుండా శిక్ష పడాలి.. మా బాబుతో కలిసి క్రికెట్ ఆడటానికి వచ్చేవాడు.. ఇంత క్రిమినల్ మైండ్ ఉందని అస్సలు ఊహించలేదు.. ఇంత దారుణం తర్వాత కూడా మా ఇంటికి వచ్చాడంటే, ఎంత క్రూరమైన ఆలోచన ఉందో అర్థం చేసుకోవాలి: సహస్ర తండ్రి
