యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు ఉద్యోగ పత్రాలు పంపిణీ చేసిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ,మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్సీ శంకర్ నాయక్
దామరచర్ల, మిర్యాలగూడ ప్రజాలహరి… తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని *మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్* నందు.. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణంలోనీ *భూ నిర్వాసితులు* బాధితులకు
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆర్ అండ్ బి శాఖ మంత్రి వర్యులు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి MLC శంకర్ నాయక్ చేతుల మీదుగా *325 మందికి* ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి బట్టి బట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల పట్ల సానుభూతితో ఉంటుందని వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రయోజనాలు అందించే కృషి చేస్తుందని అని అన్నారు. అందులో భాగమే భూమి నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు చెప్పారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ అండగా ఉండటమే తమ పార్టీ లక్ష్మణ్ పవర్ ప్లాంట్ లో నిర్మాణంలో మూడు కోల్పోయిన వారందరికీ ఉద్యోగాలు ఇప్పించడానికి కృషి చేసినట్లు చెప్పారు జిల్లా కలెక్టర్ త్రిపాటి సబ్ కలెక్టర్ అమిత్ నారాయణలు ప్రధాన భూమిక పోషించారని ఈ సందర్భంగా చెప్పారు. ఉద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడంలో జరిగే పనులు సమావేశాలకు హాజరవుతూ వారు తరుపున వారికి కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటూ ఇప్పించటములో సహకరించిన జెన్కో అధికారులుప్రజాప్రతినిధులకుఅభినందనలుతెలియజేశారు. గత పాలకులు
భూ నిర్వాసితులను పట్టించుకోలేదని పేర్కొన్నారు. తాను వచ్చిన దగ్గరనుంచి వారి సమస్యల పరిష్కరించడానికి కృషి చేసినట్లు చెప్పారు .500 మందికి ఉద్యోగాలు ఇప్పించడం వలన తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు.ఈ కార్యక్రమంలో
మభువనగిరి ఎంపీ *చామల కిరణ్ కుమార్ రెడ్డి , నల్గొండ జిల్లా కలెక్టర్ *ఇలా త్రిపాఠి
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ గార్లు* పల్గొన్నారు….
