ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్న ఫైనాన్స్ వ్యాపారస్తులు
నిరుపేదలే లక్ష్యంగా వారి శ్రమను రక్తం తాగుతున్న ఫైనాన్స్ వ్యాపారస్తులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు పేదవాడి అవసరాన్ని చనువుగా తీసుకొని ఇదే అదునుగా ఫైనాన్స్ వ్యాపారులు అధిక వడ్డీలకు పేదలను బలిజేస్తూ తమ దందాను కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో నిరుపేదలు తమ గోడును వెళ్లబుచ్చుకోలేక కక్కలేక మింగలేక అన్నట్లుగా జీవనం సాగిస్తున్నారు పేదవాడు పేదవాడి గానే మిగిలిపోతూ ఫైనాన్స్ వ్యాపారాలుస్తులు మాత్రం కోట్లకు పడగలెత్తుతూ నిత్యం వారి దందా మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతుంది వీళ్లను కట్టడి చేసే వారే లేక అడ్డు అదుపు లేకుండా ఏరులై పారుతుండడం గమనార్హం ఇకనైనా అధికారులు చొరవ చూపి వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేయవలసిందిగా ప్రజల్లో చైతన్యం తేవలసిందిగా పలువురు కోరుచున్నారు
