మిర్యాలగూడ ప్రజాలహరి…
సర్దార్ చకిలం శ్రీనివాస్ రావు పంతులు 29వ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తిరు నగర్ భార్గవ్ ఆధ్వర్యంలో స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ లో అల్పాహారంతో పాటు స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్ నందు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా పంతులు కుమారులు చకిలం అనిల్ కుమార్ , సునీల్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ నాన్నగారు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ముఖ్య పదవులు అనుభవిస్తున్న వారందరూ కూడా తమ నాన్నగారి ఆధ్వర్యంలో తయారైన కార్యకర్తలే అని తెలియజేశారు ముఖ్యంగా తిరునగరు గంగాధర్ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయడంతో పాటు చకిలం శ్రీనివాసరావు అంటే గంగాధర్ ని గంగాధర్ అంటే చకిలం శ్రీనివాసరావు అనే విధంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేయడంతో పాటు తమతో ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ
కార్యకర్తలను కాపాడారు. అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పగిడి రామలింగయ్య యాదవ్ , రంగారావు ,మాజీ మున్సిపల్ చైర్మన్ మెరుగు రోశయ్య ,లింగారెడ్డి, ఎండి ఖాదర్,ఉబ్బపల్లి మధు, గోవింద్ రెడ్డి,గంగాధర్, ఉదయ్ భాస్కర్ ,అశోక్ మలగం రమేష్ దుర్గారావు,వంశీ, కృష్ణ,కొంక శ్రీను, బాబ్జి, కొండలు, నాగేందర్, కోల వెంకన్న, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు