మిర్యాలగూడ ప్రజాలహరి..
*ప్రొ,, జయశంకర్ బడి బాట* కార్యక్రమంలో భాగంగా శనివారంమిర్యాలగూడ పట్టణంలోని *భక్కల్వాడి హై స్కూల్* పర్యటించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పాఠశాల పరిసరాలను పరిశీలించి మంచి *నీటి సమస్య ఉందని తెలియగానే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమస్యని వెంటనే పరిష్కరించాలని సూచించారు .. అలాగే టెయిలెట్స్ సమస్య ఉన్నట్లుగా ఉపాధ్యాయులు తెలియజేయడంతో సంబంధిత అధికారిని పిలిపించి అతి త్వరలోనే మరమ్మత్తు పనులు చేయాలని సూచించారు* .. అనంతరం విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేశారు .. ఈ సందర్భంగా వారు విద్యార్థులతో మాట్లాడుతూ కార్పొరేట్ స్కూల్స్ లో కంటే కూడా అత్యధిక నైపుణ్యత కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలలో ఉన్నారు.. కావున విద్యార్థులు అందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..