*మంత్రులు క్షేత్ర స్థాయి లో పర్యటించి రైతులకు భరోసా ఇవ్వాలి*
*ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలి.*
*సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి*
మిర్యాలగూడ ప్రజాలహరి*ఈరోజు మిర్యాలగూడ మండలంలోని జప్తి వీరప్ప గూడెం, అన్నారం గ్రామాలలో నీరులేక ఎండిపోయిన పంటపొలాలు వారి ఆధ్వర్యంలో సిపిఎం బృందం పరిశీలించి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేసారు*.
సందర్భంగా వారు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గం అన్ని మండలాలో అనేక గ్రామాలలో సుమారు కొన్ని వందల ఎకరాలు పంట చేతికందే సమయంలో పూర్తిగా ఎండిపోవడం జరిగాయని ముఖ్యంగా వరి పంటలు రైతులకు కోతకు వచ్చే దశలో మరియు మరికొన్ని పాలు పోసుకొని ఈనే దశలో ఈ రకంగా పంటలు ఎండిపోవడం జరుగుతుంది. సుమారు ఒక ఎకరాకు 25 వేల నుంచి 30 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు దిక్కుతోచనే పరిస్థితిలో అప్పుల బాధలతో అల్లాడుతున్నారు, కౌలు రైతుల పరిస్థితి ఇంకా గోరంగా ఉన్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా నియోజకవర్గం లో అన్ని గ్రామ పంచాయతీలలో తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరం నుండి తాగునీరు ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి కాలం గడుపుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగము, మంత్రులు,ప్రభుత్వ అధికారులు తక్షణమే ప్రత్యేక సమావేశం నిర్వహించి ముఖ్యంగా వ్యవసాయ మరియు రెవెన్యూ అధికారులు కలిసి ఎండిపోయిన పంటలను పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని అన్నారు. తాగునీరు సమస్య కోసం మండల స్థాయి అధికారులు స్పెషల్ అధికారులు గ్రామా కార్యదర్శులతో సమావేశం నిర్వహించి టాంకర్ల ద్వారా తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించి అదే రకంగా మిషన్ భగీరథ నీరు అన్ని గ్రామాలలో పూర్తిస్థాయిలో రెండు పూటలా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,రైతు సంఘం నాయకులు ఉన్నం వెంకటేశ్వర్లు, శ్రీను, నాగయ్య, నాగరాజు, రవి రైతులు పాల్గొన్నారు.