ఎల్ఆర్ఎస్ ఉచితంగా చేయాలి, ఎండుతున్న పంట పొలాలకు సాగర్ నీటి విడుదల చేయాలి అన్ని బిఆర్ఎస్ నాయకులు ధర్నా
మిర్యాలగూడ ప్రజాలహరి….
మిర్యాలగూడ పట్టణం RDO కార్యాలయం ఎదురుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలుకు నిర్ణయం తీసుకుందో దానికి నిరసనగా మరియు సాగర్ ఎడమ కాలువకు ఇప్పటివరకు నీళ్లు ఇవ్వనందుకు, అదేవిధంగా జీ.వో నెంబర్: 58 & 59 ద్వారా ప్రభుత్వ భూములలో నివాసం ఏర్పరచుకొని నివసిస్తున్న పేద ప్రజల క్రమబద్ధీకరణ కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ *రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు & బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు పిలుపుమేరకు మన మిర్యాలగూడ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్రావు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది*. ఈ ధర్నాకు నియోజకవర్గ వ్యాప్తంగా రైతులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున హాజరై ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారి నిరసన వ్యక్తపరచడం జరిగింది.. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో డీఏవో గారికి విజ్ఞాపన పత్రం అందించడం జరిగింది. ఇందులో భాగంగా వెంటనే 25 లక్షల 43 వేల మంది లబ్ధిదారుల నుంచి దాదాపు 20వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం వసూలు చేయాలని నిర్ణయించిందో అట్టి నిర్ణయాన్ని మానుకొని చేసి వెంటనే ప్రభుత్వమే ఫ్రీ’గా LRS ను అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎడమ కాలువకు నీళ్లు విడుదల చేసి రానున్న వేసవికాలంలో ప్రజలకు తాగునీరు, సాగునీరుకి ఎద్దడి లేకుండా చూడాలని డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా జీ.వో నెంబర్: 58 & 59 బిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో అట్టి జీ.వోను కొనసాగించి పేద ప్రజలకు ఒక భరోసాని కల్పించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.. కార్యక్రమంలో స్థానిక సంస్థల నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ మంకెన కోటిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, రైతుబంధు జిల్లా మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ మండల ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి, అడవిదేవులపల్లి ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, జడ్పిటిసి కుర్ర సేవియా నాయక్, నల్గొండ జిల్లా జడ్పీ కోఆప్షన్ మెంబర్ మోసీన్ అలీ, అన్ని మండలాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాలుట్ల బాబయ్య ,మట్టపల్లి సైదయ్య యాదవ్, నామిరెడ్డి కరుణాకర్ రెడ్డి, BRS పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది శ్రీనివాస్ గౌడ్, మహిళ విభాగం అధ్యక్ష , కార్యదర్శులు పెండ్యాల పద్మ, కొదాటి రమా, రాఖీ పెరుమళ్ల, అన్ని గ్రామాల మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పట్టణము మరియు అన్ని మండలాలలో అన్ని విభాగాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు..