రంగ్రీజ్ బజార్లో పాముల బెడద….. మిర్యాలగూడ ప్రజాలహరి
.
మిర్యాలగూడలోని సబ్ కలెక్టర్ కార్యాలయం సమీపంలోని రంగీజ్ పాములు సైర విహారం చేస్తున్నాయి. అందుకు కారణం లేకపోలేదు. సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి శివాలయం వెళ్లే రహదారి మధ్యలో పాడుబడ్డ భవనాలు ఉండటం చిదుగు ఎక్కువగా ఉండడంతో పాములు ఎక్కువగా తిరుగుతున్నాయి. ఒకవైపు వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మరోవైపు ఓ థియేటర్ యజమాని భవనం, దాని పక్కనే పాడుబడిన స్కూల్ భవనం ,మరోపక్క ఐబీ ఆఫీసు లో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో నాగుపాములు జెరిగోడ్డు పింజరలు అధికంగా తిరుగుతున్నాయి. గతంలో ఈ సమస్య ఉండటం వల్ల చుట్టుపక్కల భవనాల యజమాని చెట్లు తొలగించినారు. అయినా మరల చెత్త పేరుకు పోతుంది .ఇది వర్షాకాలం కావడంతో పాములు ఎక్కువగా వస్తున్నాయి మున్సిపల్ అధికారులు పట్టించుకోని ఈ ఏరియాలో పరిశుభ్రంగా ఉండే విధంగా భవన యజమానులకు నోటీసులు ఇవ్వాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ప్రాంతాల్లో పరిశుభ్రంగా ఉండే విధంగా మున్సిపల్ సిబ్బందిని పురమయించాలని కోరుతున్నారు.
