ఐద్వా జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
ఇంటింటికి కరపత్రం పంపిణీ
మిర్యాలగూడ , ప్రజాలహరి
జనవరి 25 నుంచి 28 వరకు హైదరాబాదులో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి కోరారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ లో ఐద్వా జాతీయ మహాసభల కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్ని రంగాలలో మహిళల పట్ల వివక్షత లైంగిక దాడి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో మహిళల పట్ల చిన్నచూపు ఉందని ప్రభుత్వాలు మహిళలకు రక్షణ కల్పించే విధంగా చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. చట్టసభలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు మహిళలు అన్ని రంగాలలో రాణించే విధంగా ప్రోత్సహించాలని కోరారు. మహిళలు సామాజిక, ఆర్థిక రంగాలలో అభివృద్ధి చెందాలని సూచించారు. దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న సంఘటనలపై ఈ జాతీయ మహాసభలలో చర్చించి భవిష్యత్తు కార్య చరణ రూపొందించనున్నట్లు తెలిపారు. దేశ నలుమూలల నుండి సుమారు 1000 మంది మహిళలు ఈ మహాసభలకు హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ కార్యదర్శి మనుల అరుణ అధ్యక్షురాలు కొంపెల్లి కౌసల్య, సభ్యులు జి మణెమ, డి. లలిత, ఎన్. నిర్మల తదితరులు పాల్గొన్నారు.
