ఓటరు జాబితాలో అభ్యంతరాలు అంటే తెలుపవచ్చు.
ఎంపీడీవో:: దండ
వేములపల్లి( ప్రజాలహరి) రానున్న ఎంపిటిసి/ జెడ్పిటిసి ఎన్నికల ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపవచ్చు అని వేములపల్లి ఎంపీడీవో దండ జనార్దన్ రెడ్డి తెలిపారు. శనివారం వేములపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపీటీసీ/ జడ్పిటిసి యొక్క పోలింగ్ కేంద్రాల వారిగా డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితా, మండల పరిషత్ కార్యాలయంలో అందుబాటులో ఉంచినట్టుగా ఆయన తెలిపారు. ఇట్టి ఓటర్ జాబితాలో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే 6 వ తారీకు నుండి8 వ తారీకు వరకు తమ దృష్టికి తెచ్చి పూర్తి సమాచారం తెలుసుకోవచ్చని ఆయన తెలిపారు. అంతేకాకుండా వేములపల్లి మండలంలోని మొత్తం పోలింగ్ స్టేషన్లో 38 ఉండగా అందులో 9966 మంది పురుషులు ఓటర్లు ఉండగా, మహిళా ఓటర్లు 10602 ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క ఓటరు తమకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే చూసుకోవచ్చని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు.
