మిర్యాలగూడ సిపిఐ పార్టీ కార్యాలయంలో భారత కమ్యూనిస్టు పార్టీ ముద్దుబిడ్డ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి ఘనంగా నివాళులు అర్పించి ఘనంగా సంతాపం తెలియజేసినారు ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా మొదలైన రాజకీయ ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బడుగు బలహీన అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆహార్నిశలు ప్రజా పోరాటాలు చేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముందు భాగంలో ఉండుటకు ఆయన వంతు కృషి చేసే వారిని వారన్నారు ఆయన తుది శ్వాస వరకు మీరు చూపిన పోరాట పటిమ రాబోయే తరాలకు దిక్చూచి మీ మరణం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కి తీరని లోటుని వారన్నారు కమ్యూనిస్టు పార్టీ ఒక ధ్రువతారను కోల్పోయిన మీ ఆశయ సాధన అజా రామరం అందుకో మా విప్లవ జోహార్లు జోహార్ రెడ్ స్టార్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహార్ జోహార్ వారికి ఘనంగా నివాళులర్పించిన వారి లో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లు జిల్లా యాదగిరి పోలేపల్లి ఉదయ్ కుమార్ గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి ధీరావత్ లింగ నాయక్ మహిళా సమైక్య నియోజకవర్గ కార్యదర్శి ఎర్రబోతు పద్మ వర్కింగ్ ప్రెసిడెంట్ డి శాంతి మహిళా సమైక్య పట్టణ కార్యదర్శి ఎస్కే షమీం మహిళా సమైక్య నాయకురాలు బంటు రాజేశ్వరి ఎర్ర మాద సులోచన సమితి సభ్యు లు ఎర్ర మాద శ్రీనివాస్ రెడ్డి బసక పరమేష్ రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
