* *తక్షణమే కల్వర్ట్ నిర్మించి ప్రమాదాలు అరికట్టాలి*
* *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు*
మిర్యాలగూడ ప్రజాలహరి* భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ (CPM)ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా ఈరోజు మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి, తక్కెళ్ళపాడు, తడకమళ్ళ, గ్రామాలలో సమస్యల అధ్యయన యాత్రను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో ప్రజానీకం ఎదురుకుంటున్న సమస్యలను అధ్యయనం చేస్తూ,మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి, తక్కెల్లపాడు, తడకమళ్ళ కు వెళ్లే దారిలో ముల్కలకాల్వ మేజర్ పై ఉన్న కల్వర్ట్ కూలిపోయి ప్రమాదకరంగా ఉన్నదని గుర్తించడం జరిగింది.అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికనా కల్వర్ట్ నిర్మించి సమస్యను పరిష్కరించి ప్రమాదాలు జరగకుండా చుడాలని సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా సమస్యల అధ్యయనం లో భాగంగా అధికారులను, ప్రజా ప్రతినిధులను కోరడమైనది. సిపిఎం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మండలంలో ఉన్నటువంటి ప్రజానీకం ఎక్కువ సంఖ్యలో హాజరై వారి అభిప్రాయాలను, సమస్యలను తెలియజేసి సిపిఎం నిర్వహించే భవిష్యత్తు పోరాటాల్లో వారి వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా వారు పిలుపునివ్వడం జరిగింది. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, మండల కార్యదర్శి రవి నాయక్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చౌగాని సీతారాములు, మండల నాయకులు చౌగాని వెంకన్న, నాగ్ హుస్సేన్, శాఖ కార్యదర్శి గుండు నాగయ్య, శంకర్,రాము, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు*
