Ultimate magazine theme for WordPress.

బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం దామర చర్ల లో ప్రచారం చేసిన మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు

left home Post top

*దామరచర్ల కేంద్రంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమోతు భాస్కర్ రావు

మిర్యాలగూడ దామరచర్ల  ప్రజాలహరి

_*బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన దామరచర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సోము నరసమ్మ ను ఈ వారం రోజులు బాగా కష్టపడి ఇంటింటికి ప్రచారం చేసి, మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించి ఎట్లాగైనా దామరచర్ల గ్రామపంచాయతీలో గులాబీ జెండా ఎగురవేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు*_..

 

దామరచర్ల కేంద్రంలో గ్రామపంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఈరోజు సాయంత్రం ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ సందర్భంగా అభ్యర్థి సోము నరసమ్మ తో కలిసి మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు గారు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి ఓటర్లను అభ్యర్థించి గ్రామ అభివృద్ధిలో సహకరించాలని అదేవిధంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు పర్యాయాలలో గ్రామాలు అన్నీ కూడా ఎంతో సమృద్ధిగా అభివృద్ధి చెంది పారిశుద్ధ్య విషయంలో గానీ పచ్చదనం విషయంలో గాని పరిశుభ్రత విషయంలో గాని అన్ని రకాలుగా సంపూర్ణ అభివృద్ధిని చెందాయని అదే ఓరవడిని కొనసాగించాలంటే బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సోము నరసమ్మ గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు… ఈ సందర్భంగా దామచర్ల కేంద్రంలోని 12. 13. 14 వార్డులలో తిరిగి సోమనరసమ్మను మరియు వార్డు మెంబర్లను గెలిపించాలని కోరారు

ఇంటింటా ప్రచారం చేసి సోమ నరసమ్మ గెలుపు కొరకు కరపత్రాలను అందించారు…

 

కార్యక్రమంలో కుందూరి వీరకోట్ రెడ్డి. సోమ సైదిరెడ్డి . కొండారపు బ్రదర్స్ వీరబాబు. మాలు. బాల సత్యనారాయణ .లక్ష్మయ్య. రంగా. వెంకటేశ్వర్లు నాగిరెడ్డి వెంకటి కాసిం నాగరాజు. సైదయ్య .రఫీ .మరియు వార్డు మెంబర్లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.