ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
నల్గొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవర్ గారి ఆదేశాల మేరకు డిఎస్పి రాజశేఖర్ రాజు నేతృత్వంలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి మాదకద్రవ్యాల అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపి నిరంతర నిఘాలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు త్రిపురారం గ్రామం శివారులో గంగ దేవరమ్మ గుడి సమీపంలో కొంతమంది గంజాయి సేవించడం కొరకు తెచ్చుకున్నరు అని విశ్వసనీయ సమాచారం మేరకు త్రిపురారం పిఎస్ కు సంబంధించిన ఎస్సై కే నరేష్ గారు తన సిబ్బందితో పెట్రోలింగ్‌కు వెళ్లగా నలుగురు యువకులు గంజాయి సేవిస్తూండగా 1.6 కేజీల గంజాయిని మరియు మూడు సెల్ ఫోన్లు 1100 రూపాయలు నగదు ఒక బైకును స్వాధీన పరుచుకున్నట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు, మరియు సదరు గంజాయిని చల్లా అంజి వద్ద కుమ్మెర శివ కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో డిఎస్పి శ్రీ రాజశేఖర్ రాజు తెలియపరిచారు ఇట్టి కేసును చేదించడంలో భాగంగా ప్రత్యేక ప్రతిభ కనబరిచిన డి సతీష్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హాలియా కే నరేష్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ త్రిపురారం వీరయ్య హెడ్ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్స్ శ్రీను చంద్రశేఖర్ నాగేశ్వరరావు ఆర్ శ్రీనివాస్ మరియు హోంగార్డు రఫీ చాంద్‌బాషా ఇబ్రహీం కవితలను జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు
