- *మిర్యాలగూడ పట్టణంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం*
*పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి*
*పేద విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి*
**ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్*
- మిర్యాలగూడ ప్రజాలహరి
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని మిర్యాలగూడ పట్టణంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం గా జరిగిందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్ అన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థులకు దొంగ హామీలు ఇచ్చి గద్దినెక్కారు అన్నారు ఆరు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రంలో 8150 కోట్ల దాకా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్లో ఉందని అన్నారు ప్రైవేటు కళాశాలలో చదివే విద్యార్థులకు సర్టిఫికెట్స్ తీసుకుందాము అంటే ప్రభుత్వం నుండి డబ్బులు రాలేదని విద్యా సంస్థల యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు గత నెల రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు పీజీ కళాశాలలో ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రంలో బందుకు పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం వార్త చర్చలు జరిపి 1200 కోట్ల రూపాయలను రెండు దఫాలుగా విడుదల చేస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా మోసం చేసింది అన్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న విద్యారంగ సమస్యలపై సమీక్ష చేయడానికి విద్యారంగానికి ప్రత్యేక విద్యశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు అన్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రిని నియమించాలన్నారు అలాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ డివిజన్ అధ్యక్షులు జగన్ నాయక్ వాదుద్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యుడు న్యూమాన్ దామచర్ల మండల కార్యదర్శి వీరన్న SFI నాయకులు కోటేష్ అనిల్ వెంకటేశ్వర్లు బన్నీ హనుమంతు ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా గర్ల్స్ కోకన్వీనర్ ప్రసన్న నవ్య కావ్య కళ్యాణి పవన్ అంజి సిపాయి వంశీ వరుణ్ నాగు తదితరులు పాల్గొన్నారు
