మిర్యాలగూడ ప్రజాలహరి*మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు కి పితృవియోగం— పరామర్శించి నివాళులు అర్పించి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ప్రధాన నేత శ్రీ. తన్నీరు హరీష్ రావు గారి తండ్రి అయిన శ్రీ. తన్నీరు సత్యనారాయణ గారు ఈరోజు ఉదయాన్నే స్వర్గస్తులైనారు.. విషయం తెలుసుకున్న *మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే శ్రీ. నల్లమోతు భాస్కర్ రావు గారు హైదరాబాదులోని వారి స్వగృహంనకు వెళ్లి సత్యనారాయణ గారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు*..
నివాళులు అర్పించిన వారిలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆర్మూరు మాజీ శాసనసభ్యులు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు..
