రోడ్డును తవ్వారు… వేయడం మరిచారు.
నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి.
గుంతలలో వర్షపు నీరు నిలబడి దోమలకు ఆవసంగా మారింది.
వెంటనే రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలి.
గంగుల మహేశ్వరీ బిక్షం యాదవ్.
మిర్యాలగూడప్రజాలహరి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ పరిధిలోని నంది పహాడ్ బై పాస్ నుంచి పట్టణ పరిధిలోకి వచ్చే ప్రధాన రహదానిని అండర్ గ్రౌండ్ డ్రైనేజి మరియు రోడ్డు వెల్డల్పు కోసం తవ్వకాలు చేపట్టడం జరిగిందని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు గంగుల బిక్షం తెలిపారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ రహదారి గుండా నిత్యం వేలాది వాహనాలు పాదచారులు ప్రయాణిస్తారని గుంతల రోడ్లో ప్రయాణించడం వలన వాహనాలు త్వరగా చెడిపోవడంతో పాటు వాహనదారులకు రోడ్డు ప్రమాదాలుజరుగుతున్నవి. అలాగే రోడ్డుపై గుంతలు ఉన్నచోట వర్షపు నీరు నిలబడి దోమలకు ఆవాసంగా ఏర్పడి చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కావున ఆర్ అండ్ బి అధికారులు స్పందించి కాంట్రాక్టర్ వెంటనే రోడ్డు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
