మిర్యాలగూడలో బీసీల రాస్తారోకో..
ప్రజాలహరి మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ మిర్యాలగూడలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహం ఎదుట మంగళవారం రాస్తారోకో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ బీసీలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేటికీ మోసం చేస్తూనే ఉన్నాయి.బీసీలపై ఎన్నికల సమయంలో మాత్రమే కపట ప్రేమలు చూపించి బీసీల ఓట్లు దండుకుంటున్నారే తప్ప బీసీలకు రాజ్యాంగపరంగా దక్కవలసినటువంటి రిజర్వేషన్లకు ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రాకపోవడం బాధాకరం,బీసీలకు మద్దతుగా ప్రతి రాజకీయ పార్టీ ఉద్యమానికి సిద్ధం కాకపోతే ప్రతి రాజకీయ పార్టీ కార్యాలయం ఎదుట బీసీలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు.ప్రతి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలు కుల సంఘాలు ఉద్యమానికి ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పోల గాని వెంకటేష్,జట్కా నాగేశ్వరరావు, ఎర్రబెల్లి గంగాధర్,పట్టేటి రమేష్, వీరస్వామి,శంకర్,శ్యామ్,సురేష్, ఉపేందర్,నవీన్,సిద్ధం రాజు తదితరులు పాల్గొన్నారు.
