స్కూల్ బస్సును ఢీ కొట్టిన లారీలు
తప్పిన ప్రమాదం
ప్రజాలహరి వేములపల్లి
రెండు లారీలు స్కూల్ బస్సును ఢీ కొట్టిన సంఘటన మంగళవారం శెట్టిపాలెం సమీపంలో అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మిర్యాలగూడ పట్టణంలోని ఆదిత్య పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు మండలంలోని విద్యార్థులను తీసుకురావడానికి వెళ్తు శెట్టి పాలెం క్రాస్ రోడ్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ వెనుక నుండి ఢీ కొట్టింది. అదే సమయంలో హైదరాబాదు నుండి మిర్యాలగూడ వైపు వస్తున్న లారీ ముందు భాగాన్ని ఢీ కొట్టింది. ఏకకాలంలో బస్సు వెనుక ముందు భాగాలను లారీలు ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ ఇరుక్కు పోయాడు. స్థానికులు, పోలీసుల సహాయంతో బయటకు లాగి ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ కు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో విద్యార్థులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
