అధిక వడ్డీ ఆశ చూపి రూ:50 కోట్ల మేర వసూలు..!
– జల్సారాయుడు బాలాజీ నాయక్ అరెస్ట్
– డిగ్రీ పెయిల్,కొట్లరూపాయల అప్పులతో జల్సాలు…
– అధిక వడ్డీకి ఆశపడి మోసపోవద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్
ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
అధిక వడ్డీ పేరుతో ఆశ చూపి దాదాపు 50 కోట్ల మేర అమాయక ప్రజల వద్ద నుండి ఏజెంట్ల ద్వారా వసూలు చేసి మోసం చేసిన నిందితుడు బాలాజీ నాయక్ ను ఆరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.అధిక వడ్డీ వ్యాపారస్తుల పట్ల జిల్లా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్ల గ్రామం పలుగు తండాకు చెందిన బాలాజీ నాయక్ పై గుడిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు తెలిపారు.అతని వద్ద నుండి 80 లక్షలు విలువ చేసే స్కార్పియో కారు, మిర్యాలగూడ ,హయత్ నగర్,నేరేడుచర్ల ,పలుకుతాండాలలో ఇండ్లు దామరచర్ల వద్దిపట్లలో వ్యవసాయ భూమి, బాధితులకు రాసి ఇచ్చిన ప్రామిసరీ నోట్లు ,ఏడు సెల్ ఫోన్లు ,ఒక రిజిస్టర్ బుక్ స్వాధీనం చేసుకునామన్నారు. పలుగు తండాకు చెందిన బాలు నాయక్ 2019 సంవత్సరంలో డిగ్రీ ఫెయిల్ అయి తర్వాత 2020 సంవత్సరంలో ఐస్ క్రీమ్ పార్లర్ వ్యాపారం కొరకు బంధువుల వద్ద 5 లక్షల రూపాయలు రెండు రూపాయలు వడ్డీతో తీసుకొని వ్యాపారంలో నష్టపోయినట్లు ఎస్పీ తెలిపారు.
తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని డబ్బులు 2 రూపాయలు వడ్డీకి దొరకకపోగా 6 వడ్డీ ఇస్తానని ఆశ చూపి నమ్మించి అదే గ్రామానికి చెందిన వారి నుంచి పది లక్షలు ఒకరి వద్ద, ఐదు లక్షలు మరొకరి వద్ద, తీసుకొని వడ్డీ చెల్లిస్తూ నమ్మించాడు వీరిని చూసిన మరి కొంతమంది ఏజెంట్లను పలుకు తండా చుట్టుపక్కల గిరిజన తండాల గ్రామాల నుండి ఏర్పాటు చేసుకొని అధిక వడ్డీ ఇస్తానని ఆశపెట్టి వీరు వద్ద డబ్బులు తీసుకొని వారికి ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి నెలకు రూ:10 వడ్డీ చెల్లించేవాడు. ఈ డబ్బుతో బాలాజీ నాయక్ విలాసవంతమైన జీవితం గడుపుతూ ఖరీదైన కార్లు విల్లాలు కొనుగోలు చేసి జనాలు నమ్మకాన్ని చూరగొన్నట్లు తెలిపారు. ఈవిధంగా బాలాజీ నాయక్ ఏజెంట్లు అయినా బంధువులు మిత్రులు చుట్టుపక్కల గిరిజన తండాలు పుట్టంగండి , గడ్డమీ తండా ,చింతల్ తండా , నక్కల పేట తండా ,పావురాల గట్టు, వద్దిపట్ల ,గ్రామాల గిరిజన ప్రజల వద్ద అధిక వడ్డీ ఆశ చూపి వారి వద్ద డబ్బులు వసూలు చేసి వారికి ప్రామిసరీ నోట్లు ఇచ్చేవారు .ఈ విధంగా బాలాజీ నాయక్ కోట్ల డబ్బులు వసూలు చేశాడు అని తెలిపారు. ఈ డబ్బుతో ఇతను ఇతని బంధువులు స్నేహితుల పేర్లతో వ్యవసాయ భూములు , ఇండ్లు ,ఖరీదైన కార్లు ,బైకులుకొని జల్సా చేసేవాడని ఎస్పీ తెలిపారు. ఇంకా అధిక డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతో నెలకు రూ:10 వడ్డిస్తాను అని జనాలను నమ్మించి కోట్లలో డబ్బులు వసూలు చేసి వడ్డీ మాత్రమే ఇచ్చి బాధితుల వద్ద ఉన్న ప్రామిసరీ నోటు వెనకాల వడ్డీ ఇచ్చినట్లు రాసి పాత ప్రామిసరీ నోటు తీసుకొని కొత్త ప్రామిసరీ నోటు అదే అసలు అమౌంట్ కి ఇచ్చేవాడని ఎస్పీ తెలిపారు.
ఇలా వచ్చిన కోట్ల డబ్బులతో వైన్ షాప్ పర్మిషన్ల కోసం సుమారు రెండు కోట్ల 30 లక్షలు ,స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడాని తెలిపారు. బ్యాంకులో వచ్చే వడ్డీ కంటే పది రెట్లు ఎక్కువ వడ్డీ ఇవ్వటంతో జనాలు ఆకర్షితులై బాలాజీ నాయక్ కు అధిక మొత్తంలో డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా బాధితులకు అసలు వడ్డీ డబ్బులు ఇవ్వలేకపోయేసరికి బాధితులు బాలాజీ నాయక్ పై ఓత్తిడి చేయడం ప్రారంభించారని ఇన్ని డబ్బులు ఇవ్వలేక బాధితుల నుండి తప్పించుకొని తిరుగుతున్నట్లు తెలిపారు.బాధితులు ఎవరైనా ఉంటే పొలిస్టేషన్ లో ఫిర్యాదు చేయాలని,తొందరపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని,కోర్టు ద్వారా బాధితులకు న్యాయం జరుగుతుందని తెలిపారు.ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి మోసపోవద్దని కోరారు.
