Ultimate magazine theme for WordPress.

నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ఫ్యామిలీ రెస్టారెంట్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ అధికారులు హోటల్ యాజమాన్యాలకు భారీగా ఫైన్ లు వేశారు

left home Post top
  1. మిర్యాలగూడ పట్టణంలోని పలు హోటళ్లపై మున్సిపల్ అధికారులు ఆకస్మికతనిఖీలు…..నిబంధన విరుద్ధంగా హోటల్ లో నిర్వహిస్తున్న యజమానులపై చర్యలు… మిర్యాలగూడ ప్రజాలహరి.

 

మిర్యాలగూడ పట్టణంలోని పలు రెస్టారెంట్లు కాఫీ సెంటర్ లపై ఈరోజు మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పలువురు అధికార సిబ్బందితో కలిసి రెస్టారెంట్లు కాఫీ సెంటర్లను తనిఖీ చేశారు. ఇతనికిలో ఆయా వ్యాపార సంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలు విరుద్ధంగా వ్యాపారాలను ఇస్తున్నట్లు తేలింది వ్యాపారాలు నిర్వహించాలంటే ముందుగా స్థానికంగా ట్రేడ్ లైసెన్స్ మరియు ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నట్లుగా సూచికల బోర్డులు పెడుతూ ఆయా వ్యాపారాలను నిర్వహించాలి అవేమీ పాటించకుండా నిర్వహిస్తున్న వాటిపై కఠిన చర్యలకు ఈరోజు మున్సిపల్ సిబ్బంది దిగింది మద్రాస్ ఫిల్టర్ కాఫీని తనిఖీ సీజ్ చేశారు అదేవిధంగా కృష్ణపట్నం ఫ్యామిలీ రెస్టారెంట్ కి 30,000, ఎస్ ఎస్ ఎస్ రెస్టారెంట్ కు 20,000 ,దావత్ బిర్యాని కి 25000 ,ఖలీల్ దాబా కు 30000, శ్రీకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ కు 50,000 చొప్పున జరిమాన విధించడం జరిగింది. చిల్ కేఫ్ రెస్టారెంట్ కు షోకాజ్ నోటీసు, టి వనము నోటీసు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మిర్యాలగూడ మున్సిపాలిటీ ట్రేడ్ లైసెన్స్ ప్రాపర్టీ టాక్స్ కట్టకుండా నేర్పిస్తున్న సాయిరాం మోటార్స్ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది వారితో పాటుగా ఈ హోటల్ యజమానులకు ట్రేడ్ లైసెన్స్ ప్రాపర్టీ టాక్స్ కట్టకుండా ఉంటున్నందుకు కూడా నోటీసులు చేయడం జరిగింది నోటీసులు జారీ చేయడం జరిగింది. మున్సిపల్ పరిధిలో ఉన్న హోటల్లు అందరు ట్రేడ్ లైసెన్స్ పొందాలి .ప్రాపర్టీ టాక్స్ కట్టుకుంటూ హోటల్స్ లో పరిశుభ్రత కూడిన వాతావరణంలో వ్యాపారం నిర్వహించుకోవాలని చెప్పారువిట్రోస్ సినిమా ధియేటర్ తనిఖీ చేశారు వీరికి మున్సిపాలిటీ అనుమతులు లేవని వెంటనే తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు

రెస్టారెంట్ తనిఖీలు కమీషనర్ తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్లు వెంకటరమణ రవి ,తేజ, మేనేజర్ జ్ఞానేశ్వరి టి పి ఓ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.