కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న రెండు కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెక్కు రూపంలో అందజేసిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ డబ్బును మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతులకు యూరియా రూపంలో అందజేయాలని కోరిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజాలహరి..ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసిన మిర్యాలగూడ శాసనసభ్యుడు బత్తుల లక్ష్మారెడ్డి 2 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు. కుమారుడి వివాహ రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలనుకున్న డబ్బును నియోజకవర్గంలోని రైతులకు ఉపయోగపడే కార్యక్రమంగా మార్చుకోవాలని భావించి 2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కి అందించారు.
✅లక్ష్మారెడ్డి గారు కుటుంబ సభ్యులు, నల్గొండ లోక్‌సభ సభ్యులు కుందూరు రఘువీర్ తో వచ్చి ముఖ్యమంత్రి ని కలిసి చెక్కును అందించారు. ఆ డబ్బును మిర్యాలగూడ నియోజకవర్గంలోని రైతుల కోసం ఖర్చు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా అందజేయాలని కోరారు.
✅లక్ష్మారెడ్డి తన కుమారుడు సాయి ప్రసన్న వివాహ రిసెప్షన్ మిర్యాలగూడలో నిర్వహించాలని భావించినప్పటికీ దాన్ని రద్దు చేసుకుని ఆ డబ్బును రైతులకు ఉపయోగపడే కార్యక్రమం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. రైతులకు ప్రయోజనం కలిగించే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
ని, వారి కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి అభినందించారు.
