మిర్యాలగూడ ప్రజాలహరి … , మిర్యాలగూడ డివిజన్ పరిధిలో కొత్తగా నియమించబడిన జీపీఓలకు మూడు (03) రోజుల (17.09.2025 నుండి 19.09.2025) వరకు శిక్షణా కార్యక్రమాన్ని సబ్-కలెక్టర్ కార్యాలయం, మిర్యాలగూడ నందు ఏర్పాటు చేయడం జరిగింది.
ఈరోజు కార్యాలయం నందు నిర్వహించిన మొదటి రోజు శిక్షణా కార్యక్రమాన్ని మిర్యాలగూడ సబ్-కలెక్టర్, అమిత్ నారాయణన్ పరిశీలించి, జీపీఓలతో మాట్లాడడం జరిగింది.
వారు మాట్లాడుతూ….ప్రజా సంక్షేమం మరియు రెవెన్యూ శాఖ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని, బాధ్యతాయుతంగా తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాల్సిందిగా జీపీఓలకు సూచనలు చేయడం జరిగింది. అలాగే, అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా అంకితభావంతో, నిజాయితీతో పని చేయాలని జీపీఓలను ఆదేశించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం నందు DAO శ్రీనివాస్ శర్మ, తహసీల్దార్లు సురేష్, కృష్ణయ్య , రఘు పాల్గొనడం జరిగింది.
