యూరియా కొరత పై మంత్రి తుమ్మల దృష్టికి తీసుకు వెళ్లిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి స్పందించిన మంత్రి మిర్యాలగూడ కు అధిక మొత్తంలో యూరియా నిల్వలు పంపిస్తా
*వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తో MLA -BLR భేటీ.. యూరియాపై రైతులకు భరోసా*
మిర్యాలగూడ ప్రజాలహరి
ఈరోజు ఖమ్మం నందు వ్యవసాయ శాఖ మంత్రి *తుమ్మల నాగేశ్వారరావు గారిని* కలిసిన మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు*…నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను వారికీ వివరించి అత్యధికంగా మిర్యాలగూడ నియోజకవర్గానికి యూరియా మంజూరు చేయాలని కోరడం జరిగింది.. సానుకూలంగా స్పందించిన మంత్రి తుమ్మల గారు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి రెండు మూడు రోజుల్లో కావాల్సిన యూరియాని అందించి మిర్యాలగూడ నియోజకవర్గ రైతులకు సమస్య లేకుండా చేయాలని అదేశించడం జరిగింది..
