Ultimate magazine theme for WordPress.

వివిధ శాఖల్లో ఉన్న పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

left home Post top

మిర్యాలగూడ ప్రజాలహరి….

మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు* నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి

 

*మున్సిపాలిటీ, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రికల్, ఇరిగేషన్,. నేషనల్ హైవే, మరియు R&B*

 

అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింధి…

 

ఈ సందర్భంగా *MLA-BLR గారు* మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న పలు శాఖల పనులపై రివ్యూ తీసుకొని వాటిని త్వరగా పూర్తి చేయాలని సూచించారు..

 

అధికారులు ప్రతిఒక్కరు సామాజిక బాధ్యతతో పనిచేయాలి..అనేది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని అన్నారు..

 

మిర్యాలగూడ అధికారులు అంటే నిబద్దత కలిగి ఉంటారు అనే సందేశం ప్రజల్లోకి తీసుకొని పోవాలన్నారు..

 

మాలాంటి నాయకులు ఎంత చేసినా ప్రభుత్వం ఎంత చేసినా మీ అధికారులు సక్రమంగా పనిచేయకపోతే వ్యవస్థలో మార్పులు రావని అన్నారు…

 

మా రాజకీయ నాయకుల కంటే కూడా మీ ప్రభుత్వ అధికారుల బాధ్యత చాలా ప్రధాన మైనది..

 

మేము కొంత కాలం మాత్రమే ఉంటాము మా పదవులు శాశ్వతం కాదు కానీ అధికారులు మాత్రం శాశ్వతంగా ప్రజల తరుపున పనిచేయాల్సి ఉంటుంది అని అన్నారు…

 

ఎవరైనా తమ డ్యూటీ సరిగా చేయకపోతే వెంటనే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు..

 

ఈ కార్యక్రమంలో పలు శాఖల ఉన్నత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.