*ప్రతీ రైతుకు యూరియా అందిస్తాము.. రైతులకు MLA-BLR భరోసా..*
ప్రజాలహరి మిర్యాలగూడ
ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు.*. అగ్రికల్చర్ ఏవో లు, ఏఈవో లు,సీఈఓ లు ఇతర అధికారులు సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది..
ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రతీ రైతుకు , ప్రతీ ఎకరాకు యూరియా అందేవిధంగా ప్రతిఒక్కరం కృషి చేయాలి అన్నారు.. బ్లాక్ మార్కుట్ కి దళారులకు యూరియా అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు…
రైతులను ఇబ్బందులు పెట్టేందుకు కేంద్రం యూరియా కొరత పెట్టి చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టె విధంగా మనకి వచ్చిన యూరియాను అవసరమైన ప్రతీ రైతుకు అందేవిధంగా ఒక ప్రణాళికతో చేయాలి అన్నారు..
అలాగే రైతులు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం.. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, రైతుల పక్షాన ఉండి రైతులకు అండగా ఉంటామని అన్నారు…
