మిర్యాలగూడ ప్రజాలహరి
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద జిల్లాలో అర్హత ఉన్న వారందరూ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద కుటుంబ పెద్ద మరణించినట్లయితే జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
గురువారం నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి ఒకేసారి 20వేల రూపాయలు ఆర్థిక సాయం అందించే విధంగా ఈ పథకం తీసుకురావడం జరిగిందని ,జిల్లాలో 2017 ఏప్రిల్ 1 నుండి కుటుంబ పెద్ద మగ లేదా ఆడ ఎవరు మరణించినా మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు, అవసరమైన పత్రాలన్నింటిని గతంతో పోలిస్తే లక్షన్నరకుపైగా జనాభా చేరుకుందని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని పెంచాలని జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ… మున్సిపల్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మున్సిపల్ వర్కర్లు ఎవరు చేయని పనిని వారు చేస్తున్నారని, మున్సిపల్ వర్కరలంటే తనకు ఎంతో అభిమానం అని అన్నారు. కరోనా సమయంలో వారికి కావలసిన సౌకర్యాలన్ని ఏర్పాటు చేయడమే కాకుండా, వారిని సన్మానించిన సందర్భాలను ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. అయితే మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంతో పోలిస్తే జనాభా లక్షన్నరకు పెరిగిందని, దీనిని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ సిబ్బందిని పెంచాలని జిల్లా కలెక్టర్ తో విజ్ఞప్తి చేశారు.
మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయన్ అమిత్, మున్సిపల్ కమిషనర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
