ఎన్ ఎఫ్ బిఎఫ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
తాసిల్దార్ హేమలత
ప్రజల హరి (వేములపల్లి) మండలంలోని దారిద్రత రేఖ దిగువనున్నటువంటి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు గల కుటుంబ యజమాని మృతి చెందినట్లయితే అతని కుటుంబాని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జాతీయ కుటుంబ ప్రయోజనా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వేములపల్లి మండల తహసిల్దార్ హేమలత తెలిపారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ 12ఏప్రిల్ 2017 తర్వాత కుటుంబ యజమాని మృతిచెందినట్లయితే ఆ కుటుంబాన్ని పోషించే బాధ్యత మహిళ కుటుంబానికి 20వేల రూపాయలు కుటుంబ ప్రయోజనం కొరకు అవసరమైన ధ్రువపత్రాలతో తమ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని ఆమె తెలిపారు. అంతేకాకుండా దరఖాస్తు తో పాటు మరణ ధ్రువీకరణ పత్రం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 60,000 లోపు వార్షిక ఆదాయం గల ఆదాయా ధ్రువ పత్రం జత చేయవలెను ఆమె తెలిపారు.
