Ultimate magazine theme for WordPress.

ఐలాపురం రైల్వే ట్రాక్ రోడ్డు వే లో నిలిచిన నీళ్లు రాకపోకలకు ఇబ్బంది నిరసన తెలిపిన సిపిఎం నాయకులు

left home Post top

*కాలువలను తలపిస్తున్న రోడ్లు ఇబ్బంది పడుతున్న ప్రజలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన*

మిర్యాలగూడ ప్రజాలహరి

మిర్యాలగూడ మండలం ఐలాపురం, కుంట కింది తండా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, వెళ్లే దారిలో రైల్వే ట్రాక్ కింద నీరు మొత్తం చేరి కాల్వలను తలపించే విధంగా ఉందని దాని ద్వారా ఆ మార్గం గుండా పోయే ప్రజానీకం కార్మికులు, రైతాంగం, తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడమే కాకుండా వారి వాహనాలలో మొత్తం నీరు చేరి ఆర్థికపరమైన నష్టాన్ని కూడా భరించాల్సిన పరిస్థితి ఉన్నదని, కావున తక్షణమే మండల అధికారులు అక్కడ పర్యటించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని *సిపిఎం మండల కార్యదర్శి రవి నాయక్ డిమాండ్ చేశారు* ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో అక్కడ పరిస్థితులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు ఐలాపురం కుంట కింది తండాలో ఉన్నటువంటి రైతాంగం తెల్లారి జామున ఆకుకూరలు అమ్ముకోవడానికి మార్కెట్ వస్తుంటారని వారు ఈ ప్రాంతం నుంచి పోవాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. అదేవిధంగా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఆటోల ద్వారా బస్సు ద్వారా పోయోటోళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని వారు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని అధికారులు తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పిల్లుట్ల సైదులు,పోలేపల్లి గోవిందరెడ్డి, నాగేశ్వరరావు, ఆశీర్వాదం, శ్రీను నాయక్ బాలాజీ రఘు తదితరులు పాల్గొన్నారు .

post bottom

Leave A Reply

Your email address will not be published.