Ultimate magazine theme for WordPress.

సామెతలతో హితబోధ శతక పుస్తకావిష్కరణ

left home Post top

ఏరువాక సాగినట్లుగా సామెతలతో హితబోధ శతక పుస్తకావిష్కరణ….✍️ (మిర్యాలగూడ ప్రజాలహరి.)మృగశిర కార్తె పూర్ణిమలో ఏరువాక సాగుతున్నట్లుగా సామెతలతో హితబోధ శతకం అజరామర కీర్తిని పొందినది. మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ వినాయక దేవాలయంలో శ్రీ వినాయక సేవా సంస్థ ఆధ్వర్యంలో భాషా ప్రవీణ వారణాసి ఆంజనేయులు రచించిన సామెతలతో హితబోధ శతకము పుస్తకావిష్కరణ కవులు, కళాకారులు, తెలుగు భాష ప్రవీణుల, పండితుల హర్షద్వానాల మధ్యన జరిగినది. ప్రధమంగా శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష ప్రారంభమై, సర్వేజనాః సుఖినోభవంతు సామెత మరియు వినయ విజ్ఞాపనము 104 లతో పూర్తీ అయినది. సామెతలతో హీత బోధ బహు బాగా ఉందని అందరికీ అర్థమయ్యే రీతిలో రచయిత రచించడం చాలా ఆనందమని వక్తలు అభిప్రాయపడ్డారు. సభా అతిథులు అష్టావధాని కాటేపల్లి లక్ష్మీనరసింహమూర్తి, తెలంగాణ నాటక రంగాల సమైక్య అధ్యక్షుడు తడకమళ్ళ రామచంద్రరావు , గీర్వా ణాoధ్ర భాషా పండితులు సూలూరి శివ సుబ్రహ్మణ్యం శాస్త్రి, శ్రీ వినాయక సేవ సంస్థ ప్రధాన కార్యదర్శి పులి కృష్ణమూర్తి, బొడ్డుపల్లి ప్రసాద్, కాటేపల్లి లక్ష్మీనరసయ్య శర్మ కాటేపల్లి కృష్ణమోహన్ శర్మ ఆమంచి సత్యనారాయణ శర్మ ,తెలుగు ఉపాధ్యాయులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు శ్రీ సామెతల తో హితబోధ శతక రచయిత శ్రీ & శ్రీమతి వారణాసి ఆంజనేయులు శర్మ వరలక్ష్మి దంపతులను కవులు ,వినాయక సేవా సంస్థ సభ్యులు సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో పుల్లభట్ల లక్ష్మీనారాయణ శర్మ ప్రజాలహరి మాస పత్రిక ఎడిటర్ చిట్యాల శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. సామెతలతో హితబోధ శతక రచయిత వారణాసి ఆంజనేయులు శర్మ కుమారులు వారణాసి కోటేశ్వర శర్మ, వారణాసి శ్రీధర్ శర్మ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.