Ultimate magazine theme for WordPress.

పాకిస్తాన్ పై జరిపిన సింధూర్ ఆపరేషన్ లో మరణించినవీర జవాన్లకు నివాళులర్పించిన జర్నలిస్టు సంఘం

Post top

వీర జవాన్ కు పాత్రికేయుల ఘన నివాళి…

ప్రజాలహరి,మిర్యాలగూడ

 

భారత్ – పాక్ యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్ ఎం.మురళి నాయక్ కు మిర్యాలగూడ పాత్రికేయులు ఘన నివాళులు అర్పించడం జరిగింది.పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత జవాన్ ఎం.మురళి నాయక్ మృతి చెందడం పట్ల మిర్యాలగూడ పట్టణ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా విచారం వ్యక్తం చేసింది.ఆయన మృతికి సంతాపం ప్రకటించి,సోమవారం అమరవీరుల స్థూపం వద్ద కొవ్వొత్తులతో ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప ఘనత జవాన్ మురళి నాయక్ కు చెందుతుందని,ఆయన మరణం దేశ చరిత్ర పుటలో లిఖించబడుతుందని,జవాన్ కుటుంబానికి విలేఖరుల తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అయూబ్,మంద సైదులు,గుండా మహేష్,జయరాజ్,అశ్లం, మట్టయ్య,జంగా లక్ష్మణ్,చారి,నజిమ్,హమిద్,విరగాని లక్ష్మణ్,నాగభూషణం,అలుగుబెల్లి వెంకట్,కొత్తపల్లి సైదులు,నక్క శ్రీను,కె.నరసింహ,శివకృష్ణ,మంద లక్ష్మణ్,నగేష్,హరీష్,శ్యామ్ భరత్,సుదర్శన్,రాజశేఖర్,జగన్ తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.