Ultimate magazine theme for WordPress.

పేదల సంక్షేమం తమ ధ్యేయం ఎమ్మెల్సీ శంకర్ నాయక్

Post top

పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్వేయం

ఎమ్మెల్సీ శంకర్ నాయక్

వేములపల్లి( ప్రజాలహరి) పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్సీ కేశవత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని వేములపల్లి మండలంలోని మల్కా పట్నం గ్రామ శివారులోని ఎల్లమ్మ తల్లి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసినటువంటి భూ భారతి అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ధరణి పోర్టల్ ను తీసేసి భూ భారతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి పేద ప్రజలు గత పది సంవత్సరాల నుంచి తమ తమ భూములను పట్టాలుగా చేర్పించుకోవడంలో విపుల మైనటువంటి, రైతులకు భూభారతి ద్వారా పట్టాలను ఇవ్వనున్నట్టుగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన భూ భారతి ద్వారా తక్షణమే పట్టాదారు పాస్ పుస్తకాలను తీసుకోవచ్చునని ఆయన సూచించారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి ఘనత ఒక కాంగ్రెస్ పార్టీ దేనని ఆయన కొనియాడారు. ముఖ్యంగా ఈ భూ భారతి కార్యక్రమం ద్వారా రిజిస్ట్రేషన్ మోటేషన్, భూముల సర్వే మ్యాప్, పెండింగ్ లో ఉన్నటువంటి సదా బైనామా దరఖాస్తులు పరిష్కారం, భూ సమస్యల పరిష్కారానికి రెండంచుల అప్పి విధానం, భూములకు హక్కుల రికార్డు, గ్రామ రెవిన్యూ రికార్డులు రైతులకు ఉచిత న్యాయసహాయం తదితర అంశాల గురించి గౌరవ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి వివిధ కోణాల నుంచి ఆలోచించి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు తదితర అధికారుల సలహాలు సూచనలు తీసుకొని బూభారతి చట్టాన్ని తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన కొనియాడారు. గతంలో ధరణి ఫోటోలు ద్వారా ఏవైనా సమస్యలు ఉంటే రాష్ట్ర స్థాయి అధికారుల దగ్గరికి పోవాల్సిన పరిస్థితి ఉండేది. నేడు రైతులకు అలాంటి పరిస్థితి లేకుండాభూభారతి ద్వారా తమ తమ పొలాలను పట్టా చేయించుకోవచ్చు అని ఆయన రైతులకు సూచించారు. అనంతరం స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సదానంతరం ధరణి పోర్టల్ ను జూన్ 4వ తారీఖున వాడపల్లికిష్ట వేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రీ పార్టీ మాట్లాడుతూ మీ మండలంలో భూ సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మొట్టమొదటిగా స్థానిక తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లాలని ఆవసూచించారు. అక్కడ కాని పక్షంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ అమిత్, స్థానిక తహసిల్దార్ పుష్పలత, మండల డిప్యూటీ తహసీల్దార్ కోటేశ్వరి, మండల సీనియర్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్పందన, జూనియర్ అసిస్టెంట్ నాగమణి, సరిత, A.S.O రేఖ, సరిత, జైపాల్ రెడ్డి, హర్ష, రాధా, వివిధ పార్టీల రాజకీయ నాయకులు వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంతరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుసిరెడ్డి వెంకటరెడ్డి, రావు ఎల్లారెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు పాదురు గోవర్ధన శశిధర్ రెడ్డి, ఇట్టి కార్యక్రమానికి ఉచితంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంతారెడ్డి వచ్చినటువంటి రైతులకు అధికారులకు ఉచితంగా అరటి పండ్లు పంపిణీ చేశారు. మజ్జిగ ప్యాకెట్లు మాలి యాదగిరి రెడ్డి అందజేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారులు రమేష్ నాయక్, నితిన్, కిషోర్ నాయక్ పార్టీలకతీతంగా వివిధ గ్రామాల నుంచి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.