Ultimate magazine theme for WordPress.

మున్సిపల్ సిబ్బంది పనితీరుపై రోజువారి సమీక్షలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*ఇకపై డే బై డే మున్సిపల్ పనులపై రివ్యూ..MLA -BLR*

మిర్యాలగూడ ప్రజాలహరి

ఈరోజు మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  మరియు సబ్ కలెక్టర్  అమిత్ నారాయణ గార్లు..* మిర్యాలగూడ పట్టణంలోని పారిశుధ్యం, డ్రైనేజ్, వాటర్, ఎలక్ట్రికల్ సప్లయ్, స్ట్రీట్ లైట్స్ ఇతర కార్యక్రమాల గురించి చర్చించారు..

 

ఈ సందర్భంగా *MLA -BLR గారు* మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ప్రజలు రద్దీగా ఉండే ప్రధాన ప్రాంతాలైన డాక్టర్స్ కాలని, కూరగాయల మార్కెట్, బస్టాండ్ మరియు ఇతర ప్రదేశాలలో డ్రైనేజ్ గానీ, చెత్త గానీ లేకుండా శుబ్రంగా ఉంచాలని సూచించారు…

 

అలాగే పట్టణంలో స్ట్రీట్ లైట్స్ లేని ప్రతీ వార్డ్ లో అతి త్వరగా స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు చేయాలని సూచించారు…

 

పట్టణంలో దోమలు కూడా అధికంగా ఉన్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు కావున పట్టంలోని ప్రధాన కాలువ నీ జెసిబి లు పెట్టి పూర్తిగా శుభ్రం చేయాలని సూచించారు..

 

అలాగే పట్టణంలో నీటి సమస్యలు ఎక్కడ ఉన్నా తక్షణమే పరిష్కరించాలి అని అన్నారు…

 

ప్రతిసారి మీటింగ్ లో చెప్పడం పోవడం అవుతుంది గాని పట్టణంలో ఎలాంటి మార్పు కనిపించట్లేదు ..

 

అధికారులు, సిబ్బంది పనులలో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు …

 

అలాగే 48 గంటలకు ఒకసారి డే బై డే మున్సిపల్ ఆఫీస్ లో రివ్యూ మీటింగ్ పెడతాము..

 

రోజు మీరు చేసిన పనుల అప్డేట్స్ మాకు తెలియజేయాలి .. మూడు నెలల్లో పట్టణంలో మార్పు కనిపించాలి ప్రజల్లోని ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేయాలని అన్నారు…

 

ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.