Ultimate magazine theme for WordPress.

మున్సిపల్ కార్మికులకు అండగా ఉంటా.. ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*బాధ్యతగా విధులు నిర్వహించండి మేము తోడుగా ఉంటాము.. మున్సిపల్ కార్మికులతో.. MLA -..

మిర్యాలగూడ ప్రజాలహరి

 

మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం నందు శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి  ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు కాస్మొటిక్ కిట్ లను పంపిణీ చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ *గౌ,,  అమిత్ నారాయణ గారు డీఎస్పీ  రాజశేఖర్ రాజు  మరియు మున్సిపల్ కమిషనర్* ఇతర అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ దాదాపు 14 సంవత్సరాల తరువాత MLA గారి సూచనల మేరకు మున్సిపల్ కార్మికులకు కాస్మొటిక్ కిట్ అందజేయాలి అనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.. అలాగే మున్సిపాలిటీలో 60 ఏళ్ల వయసు దాటిన వారికి విరమణ ఇస్తూ వారి స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలని అనే నిర్ణయాన్ని కూడా MLA గారు సూచించారని అన్నారు…

 

అనంతరం *MLA -BLR గారు* మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా మున్సిపల్ కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.. నాకు సాధ్యమైనంత వరకు మీ అందరి సమస్యలు తీర్చేందుకు నేను కృషి చేస్తానని అన్నారు..

 

అలాగే మీరు కూడా తమ విధుల నిర్వహణలో బాధ్యతగా ఉంటూ మిర్యాలగూడ పట్టణ పరిశుభ్రతకు స్వచ్ఛదనానికి కృషి చేయాలని అన్నారు..

 

తమ పనులను బాధ్యతగా నిర్వర్తిస్తే నేను మీ వెంటే ఉంటూ మా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు… తమకి అందాల్సిన కాస్మోటిక్స్ కానీ, పెండింగ్ లో ఉన్న జీతాలు, ఇతర బిల్లులు అన్ని రిలీజ్ చేయించి మీకు అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది..

 

అదేవిధంగా మున్సిపల్ కార్మికుల్లో గానీ సిబ్బందిలో గానీ పనులు చేయకుండా బాధ్యతా రహితంగా ఉంటే వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు …

పట్టణంలోని రద్దీగా ఉంటే ప్రధాన ప్రాంతాలు బస్టాండ్, మార్కెట్, డాక్టర్స్ కాలని ఇతర ప్రదేశాలలో పరిశుభ్రంగా లేకపోయినా అక్కడి సిబ్బంది పై తక్షణ చర్యలు తీసుకుంటామని అన్నారు..

 

అనంతరం కార్మికులకు కాస్మొటిక్ కిట్స్ అందజేయడం జరిగింది..

 

ఈ కార్యక్రమంలో అధికారులు, మున్సిపల్ సిబ్బంది, కార్మికులు, కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.