ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు ఘన స్వాగతం
– కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ర్యాలీ
ప్రజాలహరి వేములపల్లి మార్చి 22
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన కేతావత్ శంకర్ నాయక్ మొదటిసారిగా మిర్యాలగూడ నియోజకవర్గానికి విచ్చేయుచున్న సందర్భంగా శనివారం వేములపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలికాంతారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి నిరంతరం పాటు పడుతుందన్నారు. తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జానారెడ్డి ఆశీస్సులతో ఎమ్మెల్సీ పదవి దక్కినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేద ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు. ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేబత్తుల లక్ష్మారెడ్డి, స్కైలాబ్ నాయక్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.